యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు దళిత బాలికలను అత్యాచారం చేసి చంపేశారు. గ్రామం వెలుపల ఉన్న పొలంలో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చనిపోయిన బాలికలకు స్నేహితులు అని పోలీసులు తెలిపారు.
నిందితులు సోహైల్, జునైద్ ఆ బాలికలను పొలాలకు రప్పించి అత్యాచారం చేశారని, బాలికలు తమను పెళ్లి చేసుకోవాలని నిందితులను బలవంతం చేయడంతో సోహైల్, హఫీజుల్, జునైద్ బాలికలను గొంతుకోసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. వారు కరీముద్దీన్, ఆరిఫ్‌లను పిలిచి సాక్ష్యాలను తొలగించడానికి బాలికలను ఉరితీశారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో చోటూ కాకుండా మిగతా వారు లఖింపూర్ ఖేరీలోని లాల్పూర్ గ్రామానికి చెందినవారని చెప్పారు. అమ్మాయిల ఇంటి పక్కన ఉండే చోటూ ఇద్దరు అమ్మాయిలను ఆ అబ్బాయిలకు పరిచయం చేశాడని, అతడిని కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు.