కర్ణాటకలో ఓ మైనర్ బాలికపై ఆమె మేనమామ అత్యాచారం చేశాడు. కడబ ప్రాంతానికి బాలిక(17) తన మేనమామ రుక్మయ్య(31) ఇంట్లో మూడేళ్లగా ఉంటోంది. ఫిబ్రవరి నుంచి బాలికపై రుక్మయ్య పలుమార్లు అత్యాచారం చేశాడు. అతను బెదిరించడంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. స్థానిక ఆశా వర్కర్ బాలిక అసౌకర్యాన్ని గుర్తించి, పరీక్షలు చేయగా ప్రెగ్నెంట్ అని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి రుక్మయ్యను అరెస్ట్ చేశారు.