మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో బస్ కండక్టర్ పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ బస్ స్టాప్ వద్ద ఎన్సీసీ క్యాడెట్ కు చెందిన ఓ వ్యక్తి బస్సు ఎక్కాడు. కండక్టర్ తాను ఎక్కిన స్టాప్ నుంచి కాకుండా దానికి ముందు స్టాప్ నుంచి టికెట్ కొట్టాడు. రూ.5 ఎక్కువ అడిగాడు. ఇస్తేనే టికెట్ ఇస్తా అన్నాడు. దీంతో ఆ ప్రయాణికుడు కోపంలో బస్ కండక్టర్ ను చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.