ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా వారి సభ్యులను పంపించి అల్లరి చేయిస్తున్నారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారు. జాబ్‌ల గురించి మాట్లాడేఅర్హత టీడీపీకి లేదు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శాసనసభ సమావేశాల్లో అయన మాట్లాడుతూ... 2014లో ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. అందుకే 2019లోచంద్రబాబును ఇంటికి పంపించారు. వైయస్ జగన్ మాటల మనిషి కాదు..చేతల్లో చూపించే ముఖ్యమంత్రి అని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 2.80 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్‌చేశారు. చంద్రబాబు ఏ ఉద్యోగ కల్పన చేయకుండా యువతను మోసగించాడు. ఇవాళ వైయస్ జగన్ ఉద్యోగకల్పన చేసిన తరువాత సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం వైయస్ జగన్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇది చూసి ఓర్వలేక టీడీపీ నేతలు సభను అడ్డుకుంటున్నారు అని తెలియజేసారు.