ఫాస్టాగ్ అమలు చేస్తున్నా టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గడం లేదు. దీంతో కొత్త విధానం ప్రవేశ పెట్టాలని కేంద్రం భావిస్తుంది. సరికొత్త ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వాహన యజమానుల బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా టోల్ ఫీజు కలెక్ట్ అవుతుంది. ఈ ఆటో మొబైల్ నంబర్ ప్లేట్ టెక్నాలజీలో ఆటోమేటిక్‌గా నంబర్ ప్లేట్ రీడ్ చేసే రీడర్ కెమెరాలు ఉంటాయి. త్వరలో అమలు చేస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు.