దసరా సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’తో మరోసారి ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ 8 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉంటుంది. ప్రతి వస్తువు కొనుగోలుకు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వనుంది. పేటీఎం, వ్యాలెట్తో కొనుగోలు చేసిన వారికి 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.