ఏపీలో 14 మంది అటవీశాఖ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో డీఎఫ్వోలు, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లున్నారు. ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ గా విగ్నేశ్ ను, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరా జులాజికల్ పార్కు క్యూరేటర్ గా సెల్వాన్ని నియమించింది. రంపచోడవరం, శ్రీకాకుళం, అన్నమయ్య, ఏలూరు, వేర్వేరు ప్రాంతాల్లోని అటవీ సంరక్షణాధికారులుగా మిగతా 12 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.