కాశ్మీర్ అందాల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కానీ ప్రపంచానికి తెలియని అనేక అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. చుట్టూ పెద్ద పెద్ద కొండలు.. మధ్యలో నది.. దానిపై బ్రిడ్జి.. ఓ అందమైన దృశ్యం. అంతటా ఉండే అందం కాదు ఇది.. అసలు భూమి నుంచి మేఘాల మీదుగా స్వర్గానికి మార్గం వేసినట్టున్న అద్భుతమైన దృశ్యమిది. ఇదంతా ఎక్కడో, ఏ యూరోపియన్ దేశాల్లోనో కాదు.. అచ్చంగా మన కశ్మీర్ లో చీనాబ్ లోయలో ఇటీవల కనిపించి అలరించిన దృశ్య కావ్యం. భారత రైల్వే తాజాగా ఈ బ్రిడ్జికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్ లో షేర్ చేసింది.
జమ్మూ కశ్మీర్ లో కొత్త రైలు మార్గం కోసం చీనాబ్ నదిపై రైల్వే శాఖ అధునాతన స్టీల్ వంతెనను నిర్మించింది. రేసి జిల్లాలో బక్కాల్ – కౌరి మార్గంలో ఇటీవలే ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. వచ్చే డిసెంబర్ లోనే దాని మీదుగా రైళ్ల రాకపోకలను ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన అని అధికారులు చెబుతున్నారు. చీనాబ్ బ్రిడ్జ్ గా పిలుస్తున్న ఈ వంతెనకు సంబంధించిన చిత్రాలను రైల్వే శాఖ ఇటీవల ట్విట్టర్ లో పెట్టింది. ‘అత్యంత అద్భుతమైన చీనాబ్ వంతెన దృశ్యాలు ఇవి’ అంటూ కామెంట్ పెట్టింది. చీనాబ్ వంతెన చిత్రాలను చూసిన వారు.. ఆ వాతావరణాన్ని, ప్రకృతి అందాలను చూసి నోరెళ్లబెడుతున్నారు. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించాలన్న భావన వ్యక్తం చేసినవారూ ఎందరో. అంత ఎత్తున రైల్వే వంతెన నిర్మించిన రైల్వే శాఖను చాలా మంది అభినందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa