ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా , అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ... కృష్ణా పుస్కరాల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం 23 దేవాలయాలు నిర్దాక్షణ్యంగా పడగొట్టింది. ఆగమ శాస్త్ర పండితులను కనీసం సంప్రదించలేదు. ఆ విగ్రహాలను చెత్త ఎత్తే మున్సిపాలిటీ ట్రాక్టర్లో తీయించారు. భక్తుల విశ్వాసాలను ఎంతో దెబ్బతీశారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల టైమ్ లో కోట్లాదిరూపాయిలతో కట్టిన నిర్మాణాలు నెల తిరిగేసరికి ఏమయ్యాయో తెలీదు? . ఏదో అట్టహాసంగా చేసామని చూపించుకోవడం కోసం, ఓ సినిమా డైరెక్టర్ సలహాతో అప్పటి సీఎం బాబు స్నానం చేసే దృశ్యాన్ని చిత్రీకరించడం కోసం చేసిన హడావిడిలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. కృష్ణా పుష్కరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కోట్లు వెచ్చించారు. కానీ రెండు నెలల తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కనిపించడం లేదని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.