ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరణ్ అదానీకి సిమెంట్ వ్యాపార నిర్వాహణ బాధ్యతలు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 10:03 PM

సిమెంట్ వ్యాపార బాధ్యతలను తన కుమారుడు కరణ్ అదానీకి అప్పగిస్తూ గౌతమ్ అదానీ నిర్ణయం తీసుకొన్నారు. ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మన దేశంలో అదానీ కంటే వేగంగా ఎదిగిన వ్యాపారవేత్త మరెవరూ లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా తన కుమారుడు కరణ్ అదానీకి గౌతమ్ అదానీ ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. అదానీ గ్రూప్ ఇటీవలే సొంతం చేసుకున్న సిమెంట్ వ్యాపార బాధ్యతలను అతనికి అప్పగించారు. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే అదానీ గ్రూప్ సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది. అదానీ పెద్ద కుమారుడు కరణ్. ఇప్పటికే ఆయన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ కు సీఈవోగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com