ఎన్.టి.ఆర్ జిల్లా, పోలీస్ కమీషనరేట్ పరిధిలోని సౌత్ డివిజన్ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ ను ఆధునీకరించాలని నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.ఇచ్చిన ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డి.సి.పి. శ్రీ విశాల్ గున్ని ఐ.పి.ఎస్.సూచనలతో సౌత్ డివిజన్ ఏ.సి.పి. డా.బి.రవికిరణ్ పర్యవేక్షణలో గవర్నర్ పేట ఇన స్పెక్టర్ శ్రీడి. సురేష్ , వారి సిబ్బందితో కలిసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ ను ఆదునీకరించడం మరియు మహిళా పోలీస్ సిబ్బందికి వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయడం మరియు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ పేట, బీసెంట్ రోడ్, లెనిన్ సెంటర్ మొదలగు ఎరియాలన్ని కవర్ అయ్యేవిధంగా గతంలో వున్న సి.సి.కెమెరాలను ఆధునీకరించడంతో పాటు, హై.క్వాలిటీ ఐ.పి.బేసిడ్ సి.సి.కెమెరాలు మొత్తం 53 సి.సి.కెమెరాలను ఏర్పాటు చేయించి వాటి పర్యవేక్షణ కోసం గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో వున్న సబ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడం జరిగింది.