ముంబైలోని మలాడ్ ప్రాంతంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. ఓ స్కూలు లిఫ్ట్‌లో ఇరుక్కుని 26 ఏళ్ల జినెల్ ఫెర్నాండెజ్ అనే టీచర్ ప్రాణాలు కోల్పోయింది. ఆరో అంతస్తు నుంచి రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్‌కు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్ ఎక్కబోయింది. లిఫ్ట్ పూర్తిగా ఎక్కకుండానే అది పైకి కదిలింది. దీంతో ఆమె లిఫ్ట్ మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.