కర్ణాటక దేవనహళ్లి సమీపంలోని అవతి గ్రామంలో దారుణం జరిగింది. సౌమ్య (23), సుబ్రమణ్య (25) బెంగళూరులో ఒకే చోట పని చేసే వారు. కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. సౌమ్య హఠాత్తుగా పని మానేసింది. ఆరా తీయగా వేరే వ్యక్తితో ఆమె పెళ్లి జరిగినట్లు సుబ్రహ్మణ్య తెలుసుకున్నాడు. బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సౌమ్యను సుబ్రహ్మణ్య కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.