ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అమానుష ఘటన జరిగింది. మహస్ అమినీ (22) అనే యువతి ఫ్యామిలీతో సహా టెహ్రాన్‌ను ఇటీవల సందర్శించింది. ఆ సమయంలో ఆమె హిజాబ్ ధరించలేదు. ఇది చూసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే హఠాత్తుగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిన ఆ యువతి శనివారం తుది శ్వాస విడిచింది. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.