బీజేపీకి 'బీ-టీమ్'గా వ్యవహరిస్తూ కాంగ్రెస్ను బలహీనపరుస్తున్నారనే ఆరోపణలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఖండించారు. కాంగ్రెస్ను బలహీనపరచడంలో ప్రతిపక్షాలు కంటే రాహుల్ గాంధీయే సమర్థుడని సెటైర్ వేశారు. ప్రతిపక్షాల కూటమిపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ''నేను ఎవరికీ వ్యతిరేకం కాదు, కానీ ఈ పొత్తు రాజకీయాలు నాకు అర్థం కావడం లేదు'' అని పేర్కొన్నారు.