గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వేచ్ఛా త ఈ సేవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గ్రామ సర్పంచి జాలాది యానాది రావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొని గ్రామాన్ని స్వచ్ఛతాయుతంగా ఉంచాలని వ్యర్ధాలను రోడ్లపై వేయకుండా గ్రామపంచాయతీ కేటాయించిన డస్ట్ బిన్లో వేసి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రజలు భాగస్వామ్యం కావాలని ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించి స్వేచ్ఛా మామిళ్ళపల్లి గ్రామంగా పేరు తేవాలని సర్పంచ్ జాలాది యానాది రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పారిశుధ్య సిబ్బందితో కలిసి గ్రామంలో మానవ హారం, ప్రతిజ్ఞ చేశారు.