మంగళగిరి పట్టణం 21 వ వార్డు రత్నాలచెరువులో చిరు వ్యాపారులు నక్క తిరుపతమ్మ, బోడెపోగు అబేలు అద్దె తోపుడు బండ్ల పై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు, సొంత బండి లేక ఇబ్బంది పడుతున్న తమకు తోపుడు బండిని అందజేయాలని నారా లోకేష్ కి అర్జీ పెట్టగా వీరిరువురికి శనివారం ఉదయం స్థానిక టీడీపీ నాయకులు చేతులమీదుగా తోపుడు బండ్లు అందజేశారు.
కార్యక్రమంలో పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు పడవల మహేష్, 21వ వార్డు అధ్యక్షులు తోకల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.