22వ తేదీన కుప్పంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం ఎంపిడివో కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఉషశ్రీ చరణ్ లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడవ విడత వైయస్సార్ చేయూత పథకాన్ని సీఎం ప్రారంభోత్సవం, కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంఖుస్థాపనల కార్యక్రమాలపై అధికారులకు మంత్రులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ రిషాంత్ రెడ్డి, ఎంపి రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్ మరియు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.