బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు షాకిచ్చేందుకుసీబీఐ సిద్ధమవుతోంది. IRCTC స్కామ్ లో తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని తేజస్వి యాదవ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. 2006లో రాంచీ, పూరిలో IRCTC హోటల్స్ ను ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వడంలో భారీగా అవినీతి జరిగిందనేది సిబిఐ ఆరోపణ. ఈ స్కామ్ లో తేజస్వి 2018లో బెయిల్ పొందారు.