శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఉచితంగా అన్నదానం అందజేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కాగా, అన్నదానం పేరు చెప్పి ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దని భక్తులకు టీటీడీ సూచించింది. సికింద్రాబాద్ అనంత గోవింద దాస ట్రస్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ స్పష్టం చేసింది. అక్రమంగా విరాళాలు వసూలు చేసే ట్రస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.