టీమ్ ఇండియా కొత్త జెర్సీని విడుదల చేసింది. రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జెర్సీలో ఈ మార్పులు చేశారు. ఈ జెర్సీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది. అభిమానుల కోరిక మేరకు లేత నీలం రంగు జెర్సీని తీసుకొచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది.కొత్త జెర్సీ 2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఉన్న జెర్సీకి దగ్గరగా ఉంది. కొత్త జెర్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.