చిత్తూరు నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం "స్పందన" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ డా. జె అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక ఆవరణలో సోమవారం ఉదయం 10. 30 నుంచి స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారు మాస్కులు ధరించి, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని కోరారు. స్పందన కార్యక్రమానికి నగరపాలక శాఖాధిపతులు హాజరుకావాలన్నారు. అన్ని వార్డు సచివాలయల్లోనూ సాయంత్రం 3 - 5 గంటల మధ్య స్పందన కార్యక్రమం జరుగుతుందని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటితో పాటుగా నగరపాలక సంస్థ కాల్ సెంటర్ నెంబర్ 08572-232745, వాట్సప్ నంబర్ 98499 07885 ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు.