ప్రొద్దుటూరు పరిధిలోని సోములవారిపల్లి పంచాయతీ పెన్నానగర్ 4 వ సచివాలయ పరిధిలో ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, సర్పంచ్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్ది పాల్గొని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొంటు జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడారు. అంగన్వాడి సెంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ ఉపసర్పంచ్ మార్తల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ గోపిరెడ్డి రమణయ్య, మాజీ జెడ్పి కోఆప్షన్ అక్బర్, టీటీడీ పాలకమండలి సభ్యుడు మారుతి ప్రసాద్, ఎంపీటీసీలు సుభాష్ చంద్రబోస్, మహబూబ్ బాష, వైసీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, కోనేటి సునంద, అగ్గారపు శ్రీనివాసులు, నాయకులు గోటూరు వెంకటేష్, భూమిరెడ్డి నాగార్జునరెడ్ది, వార్డు మెంబర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.