శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో, జనసేన పార్టీ ఇంచార్జి వినూత కోట ఆధ్వర్యంలో జరుగుతున్న KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా ఈరోజు తొట్టంబేడు మం,శేషమనాయుడు కండ్రిగ హరిజనవాడ గ్రామంలో వినూత కోట పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి,సమస్యలను తెలుసుకోవడం జరిగింది. గ్రామంలో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు లేవని వర్ష కాలంలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు, అర్హత ఉన్నా కూడా పేద వారికి ప్రభుత్వం నుండి ఇళ్లు మంజూరు కాలేదని కొంత మంది మహిళలు తెలిపారు. సమస్యలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు పార్టీ తరఫున పోరాడుతామని ప్రజలకు, వినూత కోట హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి, నాయకులు రవికుమార్ రెడ్డి, ముడుసు గణేష్, జనసైనికులు పాల్గొన్నారు.