ఏపీ అసెంబ్లీలో సోమవారం పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పరిహారం కింద రూ.10 లక్షలు ఇస్తామని చెప్పిన దానికి జీవో ఇచ్చామని తెలిపారు. పునరావాసం పనులు వేగంగా జరుగుతున్నాయని, 14,110 మంది నిర్వాసితులకు రూ.19,060 కోట్లతో పునరావాసం మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. పోలవరంను చంద్రబాబే నాశనం చేశారని, చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యేందుకు కూడా అన్ ఫిట్ అని సీఎం జగన్ అన్నారు.