ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోహన్ బాబు కుటుంభానికి హైకోర్టులో ఊరాట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 10:30 PM

గత 2019 ఎన్నికల నాటి కేసు విషయంలో ప్ర‌ముఖ సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబుకు సోమ‌వారం ఏపీ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. మంచు మోహ‌న్ బాబు, ఆయ‌న ఇద్ద‌రు కుమారులు మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌ల‌పై తిరుప‌తి కోర్టులో ఓ కేసు విచార‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా... ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘిస్తూ మోహ‌న్ బాబు త‌న ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి ధ‌ర్నాకు దిగారు.


ఈ వ్య‌వ‌హారంపై మోహ‌న్ బాబు, ఆయ‌న ఇద్ద‌రు కుమారుల‌పై తిరుప‌తి పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా... ఈ కేసు విచార‌ణ తిరుప‌తి కోర్టులో సాగుతోంది. ఈ విచార‌ణ‌ను నిలుపుద‌ల చేయాలంటూ మోహ‌న్ బాబు ఇటీవ‌లే హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు... తిరుప‌తి కోర్టులో కేసు విచార‌ణ‌ను 8 వారాల పాటు నిలుపుద‌ల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com