ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్-21లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొద్ది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం.. డ్రెయిన్ మరమ్మతులు చేస్తున్న సమయంలో 200 మీటర్ల పొడవున ప్రహరీ గోడ కూలిపోయినట్లుగా తెలుస్తున్నది. ఆ సమయంలో అక్కడ 12 మంది కూలీలు పని చేస్తున్నారు. స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ బృందాలు చేరుకొని.. శిథిలాలను తొలగిస్తున్నాయి. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.