మహాపాదయాత్రలో భాగంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన పాదయాత్ర అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ వద్దకు చేరుకుంది. 30 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చి అమరావతి ప్రజా రాజధానిగా కొనసాగాలని రైతులు చేపట్టిన దీక్షకు టిడిపి శ్రేణులతోపాటు నియోజకవర్గంలో ఉన్న రైతులు పూర్తి మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు రైతులకు ఘన స్వాగతం పలికారు.