దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. ఈనెల 29 నుంచి అక్టోబరు 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది.విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 1,081 అదనపు బస్సులు నడుస్తాయని పేర్కొంది. విజయవాడ నుంచి విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడకు.. విజయవాడ నుంచి తిరుపతి, రాయలసీమ జిల్లాలకు.. విజయవాడ నుంచి అమలాపురం, భద్రాచలానికి..విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు తెలిపింది. టికెట్ రిజర్వేషన్ సదుపాయం కూడా ఉంటుందని వివరించింది. ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ప్రత్యేక బస్సుల వివరాలను పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.