పులివెందుల పట్టణంలోని నగరి గుట్టలో ఉన్న యావె బెస్సింగ్ చర్చి రెండవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధులుగా మున్సిపల్ ఛైర్మెన్ డా. వల్లెపు వరప్రసాద్. సింహాద్రిపురం వైకాపా నాయకులు శ్రీకాంత్ రెడ్డిలు హాజరయ్యారు. ఈసందర్భంగా సోమవారం సాయంత్రం కేక్ ను కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అనంతరం చర్చి నిర్వాహకులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి వార్షికోత్సవ వేడుకలను మరెన్నో జరుపుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నాయకులు రమణారెడ్డి, సర్పంచ్ నాగేంద్రరెడ్డి, సురేష్ నాయక్, కౌన్సిలర్లు కిశోర్, నాయకులు డేనియల్ బాబు, కో ఆప్షన్ మెంబర్ దాసరి చంద్రమౌళి, సుధాకర్, సురేష్, ప్రవీన్, చింతామణి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa