పర్చూరు వై జంక్షన్లో మంగళవారం రేషన్ బియ్యం పట్టుబడిన ఘటనకు సంబంధించి చీరాలకు చెందిన అమీర్ భాషా పై కేసు నమోదైంది. బాపట్ల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విలియం ఒక లారీలో అక్రమంగా రవాణా అవుతున్న 403 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకోవటం తెలిసిందే. లారీ డ్రైవర్ షేక్ జానీభాషా ను అదుపులోకి తీసుకుని విచారించగా అమీర్ భాషా ఈ రేషన్ బియ్యాన్ని నూతలపాడులో లోడ్ చేశారని వెల్లడించాడు.
ఈ మేరకు పర్చూరు ఎన్ఫోర్స్మెంట్ డీ. టీ వాసుదేవరావు ఫిర్యాదు చేయగా పై అమీర్ భాషా, జానీబాషా లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జివి చౌదరి తెలిపారు. దశాబ్దకాలంగా చీరాల ప్రాంతంలో రేషన్ మాఫియా డాన్ గా అమీర్ భాషా చెలామణి అవుతున్నాడు. మరి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.