జగన్ ప్రభుత్వ అసమర్ధ, అవినీతి పాలనను ఎండగడుతూ, నిత్యావసరాల ధరలు, కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీల పెరుగుదలను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి చీరాల మున్సిపాలిటీలోని 30వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కొండయ్య యాదవ్ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్ పాలనలో చంద్రబాబు పాలనను బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీని గెలిపించాలని కోరారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.