శ్రీకాకుళం: బీసీ వెల్ఫేర్ అధికారి అనురాధపై బాలల హక్కుల కమిషన్ చైర్మన్ గొండు సీతారామ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని బీసీ బాలుర వసతి గృహంలోని 75 మంది విద్యార్థులు వార్డెన్ వ్యవహార శైలికి నిరసనగా. వసతి గృహం నుంచి ఇంటికివెళ్లిపోయిన విషయం తెలిసిందే. నేపథ్యంలో బాలల హక్కుల కమిషన్ చైర్మన్ గొండు సీతారాం బుధవారం ఈ వసతి గృహాన్ని సందర్శించారు.
వసతి గృహానికి తనతో పాటు హాజరుకావాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అనురాధకు ముందుగా సమాచారం. అయితే ఆమె రాకపోవడంతో. ఫోన్ ద్వారా ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. ఆమె మార్గమధ్యంలో ఉన్నానని వస్తున్నానని పేర్కొనగా. 'మీకోసం కమీషన్ వేచి ఉండాలా. అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై జిల్లా కలెక్టర్ తో పాటు బీసీ వెల్ఫేర్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం వార్డెన్ పై వచ్చిన ఆరోపణలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.