భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పాడైపోయిన రోడ్లను బాగుచేసే నాథుడే లేకుండా పోయారని పలువురు నాయకులు నిరసన తెలుపుతున్నారు. తాజాగా రోడ్ల దుస్థితిపై జార్ఖండ్లో మహిళా ఎమ్మెల్యే నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయ రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ గొడ్డా మహిళా ఎమ్మెల్యే దీపికాపాండే సింగ్ రోడ్డుపై బురదనీటిలో దిగి స్నానం చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది.