గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు మరియు లోన్ యాప్ మోసాలపై ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి అవాగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా మహిళా పోలీసులు లోన్ యాప్ లలో రుణాలు తీసుకోవద్దని వాళ్లు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతారని, మీతో పాటు మీ బంధువులను కూడా ఇబ్బందులకు గురి చేస్తారని ఆర్బీఐ గుర్తింపులేని యాప్ లను డౌన్లోడ్ చేసుకోవద్దని అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతికన ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లపట్ల అవగాహన ఉండాలని మీ వ్యక్తిగత వివరాలను మరియు బ్యాంక్ ఖాతా , క్రెడిట్ కార్డ్, ఓటిపి, లాంటివి గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు. ఎవరైనా లోన్ యాప్ ల వేదింపులకు గురి అవుతున్న లేదా సైబర్ నేరాల బారిన పడిన ,వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ నం 8688831520 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.