ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య తేడాలుంటే అభ్యర్థులు సరిపోల్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 7 రోజుల వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపులో తేడాలున్నాయని భావించే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం అని ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa