ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దర్జాగా భవనంలోకి వెళ్లింది...తిరిగి ప్రయాణంలో చిక్కులు చూసింది

national |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 09:02 PM

ఎనుగు అంటేనే పెద్ద ఆకారం. దానిని బంధించడం అంటే చాలా కష్టం. అలాంటి ఎనుగును ఇటీవల ఓ‌ భవనం బంధించేసింది. ఇదిలావుంటే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా సంఘటనలు వెంటనే వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇలాగే ప్రస్తుతం ఓ ఏనుగు వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది దానిని షేర్ చేస్తూ... లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక కామెంట్లకు అయితే కొదవే లేకుండా పోయింది. అటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఆ వీడియో గురించి తెలుసుకుంటే..


ఒక చోట గజరాజు ఒక భవనంలోకి ప్రవేశించి బయటకు వెళ్లేందుకు ఒక డోర్ లోకి ప్రవేశించింది. కానీ ఆ దర్వాజాలో ఆ గజరాజు ఇరుక్కుపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. అలా అనుకోకుండా దర్వాజాలో చిక్కుకున్న ఆ గజరాజు దాని నుంచి బయటకు వచ్చేందుకు చాలా కష్టపడింది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఎలాగోలా ఆ దర్వాజా గండం నుంచి గట్టెక్కింది. ఈ తతంగం మొత్తం వీడియోలో రికార్డయింది.


ఇండియన్ ఫారెస్ట్ అధికారి అయిన సాకేత్ బడోలా ఈ వైరల్ వీడియోను తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. అలా షేర్ చేయగానే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. ఇంతకంటే గొప్ప క్వాలిటీ కంట్రోలర్‌ను మీరు చూసి ఉండరని నేను బెట్ వేస్తున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆ అధికారి ఈ వైరల్ వీడియోను పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa