పాలకొండ: సంస్థలకు, వ్యవస్థలకు పాలకులు తమ పేరులు పెట్టుకోవడం మామూలు అయిపోయింది. తమ హయంలో ఏర్పాటు చేసిన దాన్ని తమ ఇష్టమైన పేర్లును పెట్టుకోవడం తప్పు కాదని అందుకోసం అంతకు ముందు ప్రభుత్వం పెట్టిన పేరును తీసేసి తమ ఇష్టమైన పేరులు పెట్టుకోవడం అన్యాయమని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాద్ రావు గురువారం పాలకొండలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డా. వైఎస్సార్ యూనివర్సిటీ గా మరచడాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్దమవుతున్నరు అని అన్నారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా కాక ముందు అన్నీ మెడికల్, డెంటల్ కాలేజిలు అయాయ యూనివర్సిటీ పరిధిలో ఉండేవన్నారు. వాటి డిగ్రీ లు కూడా అయ్యాయా యూనివర్సిటీ లు ప్రధానం చేసేవి అన్నారు. 1986 లో మెడికల్, డెంటల్ కాలేజిలు కలిపి ప్రత్యేకంగా ఏపి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సిస్టమ్ యూనివర్సిటీ గా ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుంచి 26 మెడికల్, డెంటల్, నర్సింగ్, పారామెడికల్, కోచింగ్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చారన్నారు. 1998లో తిరిగీ గెలిచిన తరవాత యూనివర్సిటీ ని ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మర్చిందన్నారు. అప్పటి నుంచి వైద్య విశ్వవిద్యాలయం గా చెలామని అవుతుందన్నారు. ఇప్పుడు వైఎస్సార్ పేరును మర్చలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఈ మేరకు అసెంబ్లీ లో సవరణ చేయడానికి ప్రవేశ పెట్టిందన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సంస్థలకు జగన్ తన ఇష్టం వచ్చిన పేరులు పెట్టుకుంటే బాగుంటుందన్నారు. పేరు మార్చే విషయం లో జగన్ మరోసారి ఆలోచించాలన్నారు.