వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో జీవిత కాల అధ్యక్ష తీర్మానాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరస్కరించారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆ తీర్మానం అమలులో లేదని చెప్పారు. ఎన్నికల సంఘానికి అదే విషయాన్ని స్పష్టం చేస్తామని తెలిపారు. ఐదేళ్లకు ఒకసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నిక ఐదేళ్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఐదేళ్ల పాటు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉంటారని చెప్పారు. ఐదేళ్ల తరువాత ఎన్నిక ఉంటుందన్నారు.