సీఎం వైయస్ జగన్ 2019 ఎన్నికల ముందు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రాష్ట్రంలోని ప్రతీ పేదవాడి కష్టాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రాష్ట్ర ప్రజల సుస్థిరత, ఆర్థికంగా మెరుగుపరిచేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. నవరత్నాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మీడియా ముఖంగా తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతీ బీసీ పిల్లలు చదువుకోవాలని అమ్మఒడి కార్యక్రమం పెట్టారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదగాలని వైయస్‌ఆర్ ఆసరా, వైయస్‌ఆర్ చేయూత, పిల్లల కోసం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఇలా అనేక కార్యక్రమాలను ప్రతీ బీసీ వర్గాలకు అందజేస్తున్నారు. దేశ చరిత్రలో నిలిచిన ఏకైక నాయకుడు సీఎం వైయస్ జగన్. చంద్రబాబు మాట్లాడితే.. బీసీలు అని మాట్లాడుతాడు. ఈరోజుకూ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మళ్లీ బీసీలను దగ్గర చేర్చుకునేందుకు, మాయమాటలు చెప్పి మసిపూసి మారేడు కాయ చేసుకోవాలని ఈరోజు చంద్రబాబు బీసీలు గుర్తువచ్చారు. బీసీలకు న్యాయం జరిగిందంటే.. అది వైయస్‌ఆర్ కుటుంబం మాత్రమే చేసింది. చంద్రబాబు వాడుకోవడం వరకే.. అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజ్యసభలో చంద్రబాబు ఒక్క బీసీనైనా కూర్చోబెట్టాడా..? ఢిల్లీ స్థాయికి పంపించగలిగాడా..? బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలి.. న్యాయం చేయాలని అనేక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా బీసీ వర్గాల నుంచి రాజ్యసభకు నలుగురిని పంపించారు. అందులో ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఇలా నలుగురు నాయకులను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి రాజ్యసభ సభ్యులుగా కూర్చోబెట్టిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది. బీసీలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని దుయ్యబట్టారు.