అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కు ప్రజాస్పందన చూసి ప్రభుత్వం భయపడుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... రైతులను అడ్డుకోవడం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. పాదయాత్రకు మద్దతు పలికితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. రాపిడ్ బలగాలు, టియర్ గ్యాస్లు ఎందుకు? అని నిలదీశారు. మూడు ముక్కలాటకు కాలంచెల్లిందన్నారు. కేసులు, దాడులతో అమరావతి రైతుల ఉద్యమాన్ని సీఎం జగన్ అడ్డుకోలేరని దేవినేని ఉమా ట్వీట్ చేశారు.