జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా 26వ తేదీన తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగు విద్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కోరారు. విద్యా గ్రహ దీక్ష జయప్రదం చేయాలని శనివారం గుంటూరులో దీక్ష పోస్టర్ ను మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు శరత్ చంద్ర, స్టూడెంట్ లీడర్లు పాల్గొన్నారు.