మంగళగిరి నగరంలోని మన్నెం వారి బజారులో మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి సంబంధించిన స్థలం పరిరక్షణకు చర్యలు తీసుకునేందుకు దేవస్థానం అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) శనివారం పరిశీలించారు. ఈ మేరకు స్థలం చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని తెలిపారు. అదే విధంగా రాత్రి వేళల్లో స్థలంలోకి పలువురు వెళ్ళి మద్యం సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో అనుమతి లేకుండా స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రామకోటిరెడ్డి, ఆలయ సిబ్బంది, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.