మంచినీటి సరఫరాలో ఇబ్బందులు నిర్వహించేందుకు పైపు లైన్ల ఇంటర్ కనెక్షన్లు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని చెప్పారు. చిలకలూరిపేట మున్సిపల్ అధికారులతో కలిసి పైపులైన్ ఇంటర్ కలెక్షన్ల పనులను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటర్ కనెక్షన్ పనుల విషయంలో ఎలాంటి అలసత్వం చూపవద్దని, పట్టణంలోని పలు వార్డుల్లో నీటి సరఫరా లో సమస్యలు ఉన్న నేపథ్యంలో పనులు వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.