లేబర్ కోడ్ లను రద్దు చేసి, కార్మికులందరికీ 26 వేలు కనీస వేతనం అమలు చేయాలని సిపిఎం నగర కన్వీనర్ టి. తిరుపతి రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పాదయాత్ర లో భాగంగా 4 వ రోజు శ్రీకాకుళం నగరంలోని స్థానిక రాయ్ నగర్ కాలనీ వద్ద యాత్ర ప్రారంభిస్తూ కేంద్రప్రభుత్వం లో మోడీగారు ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేస్తున్నారని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లును వెంటనే వసంహరించుకొని, విద్యుత్ అదనపు రేట్లను తగ్గించాలని కోరారు.
పెంచిన అన్నిరకాల పన్నులను ఉపసంహరించాలని అన్నారు. ఆదానీలకు, అంబానీలకు పోర్టులు, విమానాశ్రయాలు, టెలికం, బొగ్గు, ఎల్. ఐ. సి, తదితర సంస్థలను అమ్మేస్తున్నారని , బడా కారోరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న పాలకులు, పేదలకు మొండి చేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి తలొగ్గి రాష్ట్రప్రభుత్వం అన్ని హక్కులూ కాలరాస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ. సత్యనారాయణ, కె. సూరయ్య, ఎం. రాఘవ, ఎన్. సూరిబాబు, ఎం. నాగేశ్వరరావు, ఆర్. అప్పన్న, గెదల రాజు, బి. అమ్మన రావు, వినోద్, మొఖలింగం, శ్యామల రావు, అప్పారావు, వాసు, రమేష్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.