దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ మూలాలు ఉంటున్నాయని బీజేపీ నాయకుడు సునీల్ దియోధర్ ఆరోపించారు. వైసీపీ హయాంలో గంజాయి సాగు పెరిగిందని చెప్పారు. టీడీపీలాగే.. వైసీపీ ప్రభుత్వం కూడా స్టిక్కర్ వేసి కేంద్ర పథకాలను కాపీ కొడుతుందని విమర్శించారు. వైసీపీ మూడేళ్ళ పాలన అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. కేంద్ర నిధులతో నవరత్నాలు ఇవ్వడం మినహా జగన్ రాష్ట్ర ప్రజలకు చేస్తుందేమీ లేదని విమర్శించారు.