సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని సాకే శైలజానాథ్ ఆరోపించారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ను చంపేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. రాజధాని విషయంలో మాట మార్చి, మడమ తిప్పారని, అవసరం కోసం హామీలు ఇచ్చి.. అధికారం వచ్చాక అవహేళన చేస్తూ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు మదమెక్కి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.