ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన అంగన్వాడీలకు ప్రభుత్వం అందిస్తున్న మొబైల్ ఫోన్లను సోమవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ శంఖవరంలో ఎమ్మెల్యే స్వగృహంలో అంగన్వాడీలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ ఎటువంటి అవినీతికి తావు లేకుండా హాజరు, సరుకుల వివరాలు పొందుపరచాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటలైజేషన్ చేశారని అన్నారు.