హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు పేరు కొనసాగించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా విస్తరింపచేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తిగా హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా ), శ్రీకాకుళం సర్పంచ్ ముప్పనేని రవి ప్రసాద్, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.g