ఎన్టీఆర్ జిల్లా విజయవాడ: ఇంద్రకీలాద్రి కొండపై కొలివితీరి ఉన్న అమ్మవారి దేవస్థానం నందు నేడు సోమవారం నుండి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వలన అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. రెండు సంవత్సరాల తర్వాత కరోనా పోవటంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య మొదటి రోజే అధికంగా పెరిగింది. దీంతో క్యూ లైన్ లో భక్తుల రద్దీ పెరిగింది.